News May 21, 2024

భారీగా పెరిగిన విత్తన పసుపు ధర

image

TG: రాష్ట్రంలో విత్తన పసుపునకు డిమాండ్ అమాంతం పెరిగింది. క్వింటా పసుపు ధర ఈసారి రూ.11 వేలకు పైగా పలుకుతుండటంతో అన్నదాతలు పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాగు విస్తీర్ణం రెట్టింపయ్యే అవకాశం ఉండటంతో విత్తన పసుపు ధర ఒక్కసారిగా పెరిగింది. గతేడాది వరకు క్వింటా రూ.1500 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.3వేల నుంచి రూ.5,500 పలుకుతోంది. కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపుతున్నా దొరకడం లేదు.

Similar News

News January 13, 2026

ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

image

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

News January 13, 2026

పాదాల అందం కోసం

image

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మ‌డమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత‌ శుభ్రం చేసుకుంటే ఫ‌లితం ఉంటుంది. * ఓట్‌మీల్‌, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.

News January 13, 2026

భోగి మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదంటే?

image

భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్, రబ్బర్, టైర్లను వేయకూడదు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఆ విషపూరిత పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆవు పిడకలు, ఔషధ గుణాలున్న కట్టెలు వేయాలి. ఇలాంటి హానికరమైన పదార్థాలను వాడటం శ్రేయస్కరం కాదు. పర్యావరణాన్ని కాపాడుతూ, మన ఆరోగ్యానికి భంగం కలగకుండా భోగి వేడుకలను జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.