News May 21, 2024

నేటితో ముగియనున్న ఓయూ వీసీ పదవీకాలం

image

ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం నేటితో ముగియనుంది. మూడేళ్ల క్రితం వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన క్యాంపస్‌లోని వైస్ ఛాన్సలర్ నివాసంలో ఉంటూ 21 పాయింట్ ఫార్ములాతో నిత్యం వర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. PHD విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఇచ్చి వందలాదిమంది పూర్వ విద్యార్థులకు డాక్టర్ డిగ్రీలను అందుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఓయూకి కొత్త వీసీ రానున్నట్లు సమాచారం.

Similar News

News September 14, 2025

HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

image

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.

News September 14, 2025

ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

image

ఈ నెల 24న ట్యాంక్ బండ్‌పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.