News May 21, 2024

కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్: కేటీఆర్

image

కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు. ‘కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం. ప్రతీ గింజకు బోనస్ అని.. ఇప్పుడు సన్న వడ్లకే అంటారా? రైతుభరోసా, రుణమాఫీ ఏమయ్యాయి? నమ్మి ఓట్లేసిన ప్రజల గొంతు కోస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News January 11, 2025

90 గంటల పని: ఉద్యోగీ ఇంతకీ నువ్వేం కోరుకుంటున్నావ్!

image

ఓ ఫౌండరేమో వారానికి 70hrs పనిచేయాలంటారు. ఆ కంపెనీలో న్యూ జాయినీ సగటు వేతనం పదేళ్లుగా పెరగలేదని సమాచారం. మరో ఛైర్మనేమో భార్యనెంత సేపు చూస్తారు? వారానికి 90hrs పనిచేయాలంటారు. ఆయన వేతనమేమో కంపెనీ సగటు ఉద్యోగి కన్నా 534 రెట్లు ఎక్కువ. కొందరు వీరికి సపోర్టు. మరికొందరు వ్యతిరేకం. ఇంతకీ ఉద్యోగి ఏం కోరుకుంటున్నాడో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధిక పని, అధిక వేతనం, రెస్ట్, ఫ్యామిలీ టైమ్‌లో మీ కోరికేంటి?

News January 11, 2025

రేపు యువతతో గడపనున్న మోదీ

image

రేపు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యువతతో గడపనున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రధాని తన Xలో పోస్ట్ చేశారు. యువతతో వివిధ అంశాలపై చర్చించడంతో పాటు వారితో కలిసే భోజనం చేయనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏటా జనవరి 12న నేషనల్ యూత్ డే నిర్వహిస్తారు.

News January 11, 2025

అక్రమ వలసదారుల వెనుక రాజకీయ కోణం

image

మ‌హారాష్ట్ర‌లో అక్ర‌మంగా నివ‌సిస్తున్న బంగ్లాదేశ్‌, రోహింగ్యాల వెనుక ఉన్న డాక్యుమెంట్ల ఫోర్జరీ సిండికేట్‌కు రాజ‌కీయ నేత‌లు, అధికారులు, NGOలతో లింకులు ఉన్న‌ట్టు సిట్ ద‌ర్యాప్తులో వెల్లడైంది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌కు ధ్రువ‌ప‌త్రాలు మంజూరు చేసి వారిని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న‌ట్టు వెలుగులోకొచ్చింది. పాస్‌పోర్టులు కూడా పొందుతున్న‌ట్టు తేలింది. ఈ విష‌య‌మై సిట్ ద‌ర్యాప్తు ముమ్మరం చేసింది.