News May 21, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.68,300గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Similar News
News January 11, 2025
BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు
AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
News January 11, 2025
వెంకటేశ్‌గారితో 10, 12 సినిమాలు చేస్తానేమో: అనిల్ రావిపూడి
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 3వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ నెల 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా అనిల్ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేశ్‌గారు ఇబ్బంది పడితే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. మా సినిమాకు, సంక్రాంతికి సంబంధం ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వెంకటేశ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మున్ముందు ఓ 10, 12 సినిమాలు ఆయనతో చేస్తానేమో’ అని పేర్కొన్నారు.
News January 11, 2025
సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్
TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.