News May 21, 2024

‘గాడ్‌ఫాదర్’ కాంబో రిపీట్?

image

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి మరో మూవీ చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్ చెప్పిన కథకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చిరు కుమార్తె సుస్మిత నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2022లో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.

Similar News

News January 11, 2025

BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

News January 11, 2025

వెంకటేశ్‌గారితో 10, 12 సినిమాలు చేస్తానేమో: అనిల్ రావిపూడి

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 3వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ నెల 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా అనిల్ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేశ్‌గారు ఇబ్బంది పడితే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. మా సినిమాకు, సంక్రాంతికి సంబంధం ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వెంకటేశ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మున్ముందు ఓ 10, 12 సినిమాలు ఆయనతో చేస్తానేమో’ అని పేర్కొన్నారు.

News January 11, 2025

సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్

image

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.