News May 21, 2024
చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు..!

UPలోని ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో IT అధికారులు రూ.100 కోట్లు గుర్తించారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు చేసింది. మొత్తం 14 ప్రాంతాల్లో రెండు రోజులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంచాలు, అల్మారాలు, బ్యాగుల్లో నోట్ల కట్టలు కుక్కారు. వాటిని లెక్కించేందుకు క్యాష్ మెషిన్లు కూడా మొరాయించాయి.
Similar News
News April 17, 2026
ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.
News April 17, 2026
BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.
News April 17, 2026
కమిన్స్ ఎప్పటి నుంచి ఆడతారంటే?

IPL: SRH కెప్టెన్ పాట్ కమిన్స్ నేడు ఆ జట్టు క్యాంపులో చేరనున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. అయితే రేపు చెన్నైతో జరిగే మ్యాచులో అతడు ఆడే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 25 నుంచి జరిగే మ్యాచులకు అందుబాటులో ఉండవచ్చని వెల్లడించాయి. కాగా కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దళం బలపడనుంది.


