News May 21, 2024

GREAT: అడవుల్లో AI కెమెరాలు

image

అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అధికారులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా పనిచేసే కెమెరాలను అడవుల్లో ఏర్పాటు చేసినట్లు IFS సుశాంత్ నందా ట్వీట్ చేశారు. ఇవి ఎప్పటికప్పుడు అడవుల్లోకి చొరబడిన వారిని, వేటగాళ్లను గుర్తించి నిమిషాల్లోనే వారి ఫొటోలను అధికారులకు పంపిస్తాయి. ఒడిశాలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్‌లో AI కెమెరాలు తీసిన ఫొటోలను ఆయన పంచుకున్నారు.

Similar News

News April 18, 2026

విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్ల పాక్షిక రద్దు

image

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్‌నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

image

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.