News May 21, 2024
రేపు సా.5కు ఇండియన్-2 ఫస్ట్ సింగిల్

శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 నుంచి ఫస్ట్ సింగిల్ ‘శౌరా’ను రేపు సా.5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇవాళ సా.5కు పాట ప్రోమోను రిలీజ్ చేస్తామన్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, SJ సూర్య, ప్రియ భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా జులై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News February 13, 2026
విజయ్-రష్మిక పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు ₹60 కోట్ల ఆఫర్?

టాలీవుడ్ క్రేజీ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఈ నెల 26న జరగనుందని SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి మ్యారేజ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹60 కోట్లు ఆఫర్ చేయగా.. ఈ జంట నో చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార, విఘ్నేశ్ పెళ్లి డాక్యుమెంటరీకి ఇదే OTT ప్లాట్‌ఫామ్ ₹25 కోట్లు చెల్లించగా వివాదమైంది.
News February 13, 2026
బంగ్లాలో BNP.. హిందువుల పరిస్థితేంటి?

గత జ్ఞాపకాలు భయపెడుతున్నా ఈసారి BNP వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తారిఖ్ ప్రకటించిన మతసామరస్య మ్యానిఫెస్టో, హిందువుల దాడులపై విచారణ జరుపుతామన్న ఆయన హామీ మైనారిటీల్లో ఆశలు రేకెత్తిస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాల పట్ల BNP సానుకూలంగా ఉన్నట్లు <<18723812>>ఖలీదా<<>> మరణ సమయంలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో హిందువుల రక్షణకు ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. బాధ్యతాయుత ప్రభుత్వంగా అందరినీ కలుపుకొనిపోవడం అసలు సవాల్.
News February 13, 2026
డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.


