News May 21, 2024
తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య

తిరుమలలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొండపై ఉన్న B-టైప్ క్వార్టర్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2026
పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.
News March 22, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 21, 2026
చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.


