News May 21, 2024
ELIMINATOR: అదే జరిగితే RCB ఇంటికే?
IPLలో భాగంగా రేపు ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, ఆర్ఆర్ జట్లు తలపడనున్నాయి. సోమవారం అహ్మదాబాద్‌లో మోస్తరు వర్షం కురిసింది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడి, రిజర్వ్‌డ్ డే రోజు కూడా అదే పరిస్థితి కొనసాగి మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో ముందున్న రాజస్థాన్ (17 పాయింట్లు) క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆర్సీబీ (14 పాయింట్లు) ఇంటి దారి పట్టనుంది.
Similar News
News January 9, 2025
బాబాయ్-అబ్బాయ్: ఫిర్ ఏక్ బార్ ఏక్ సాథ్?
శరద్ పవార్-అజిత్ పవార్ వర్గాలు తిరిగి ఏకమవుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి పదవులు ఆశచూపి శరద్ వర్గం MPలను అజిత్ వర్గం ఆకర్షిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇద్దరూ కలవాలని దేవుణ్ని ప్రార్థించినట్టు అజిత్ తల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరికను ఇరు వర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేతలు బలంగా కోరుకుంటున్నారు.
News January 9, 2025
అంతరిక్షం నుంచి లాస్ ఏంజెలిస్ వైల్డ్ ఫైర్ PHOTO
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.
News January 9, 2025
ఇజ్రాయెల్‌కూ పాకిన సొరోస్ విద్వేషం: మస్క్
రెజిమ్ ఛేంజర్ జార్జ్ సొరోస్ మానవజాతి విద్వేషి అని బిలియనీర్ ఎలాన్ మస్క్ మండిపడ్డారు. ఆయన విద్వేషం ఇజ్రాయెల్‌కూ పాకిందన్నారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతిచ్చే NGOకు ఆయన $15 మిలియన్లు డొనేట్ చేశారన్న ఇజ్రాయెలీ UN అంబాసిడర్ గిలాడ్ ఎర్డాన్ వ్యాఖ్యలపై స్పందించారు. సొరోస్‌కు బైడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును ప్రకటించడంతో ఇంతకన్నా అపహాస్యం ఉండదంటూ సెటైర్ వేయడం తెలిసిందే.