News May 21, 2024

ఎవరు మైనర్లు.. ఎవరు మేజర్లు? చట్టాలు మార్చాలా..?(1/2)

image

17 ఏళ్ల కుర్రాడు. లగ్జరీ కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలను తీసేశాడు. మరో కేసులో 16 ఏళ్ల కుర్రాడు ఓ యువతిని గర్భవతిని చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ కేసులో రేపిస్టుల్లో ప్రధాన దోషి మైనరే. 18ఏళ్ల లోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తుంది మన చట్టం. మరి నేడు 18 ఏళ్లలోపు వారు పిల్లల్లా ప్రవర్తిస్తున్నారా? తీవ్రనేరాలు చేసినా జువెనైల్ పేరిట తక్కువ శిక్షతో తప్పించుకుంటున్నారు. (1/2)

Similar News

News April 16, 2026

IPL: ఇదేం రూల్ సార్..

image

నిన్న LSGతో మ్యాచులో RCB బౌలర్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై కొందరు IPL ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అతడు తీసింది ఒకే ఒక్క వికెట్. కానీ మరో బౌలర్ రసిఖ్ దార్ 4 వికెట్లు పడగొట్టారు. అయితే హేజిల్‌వుడ్ కంటే అతడు 4 పరుగులు ఎక్కువ ఇచ్చారు. అతడి ఎకానమీ 6 కాగా హేజిల్‌వుడ్‌ది 5. దీంతో POTMకు ఇదే కొలమానమా? వికెట్లు తీయాల్సిన అవసరం లేదా? అని కొందరు BCCIని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News April 16, 2026

బియ్యపు పిండి దీపంతో కలిగే లాభమేంటి?

image

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.

News April 16, 2026

నవ గ్రహాలు – వాటి సొంత రాశులు

image

సూర్యుడు – సింహ రాశికి అధిపతి.
చంద్రుడు – కర్కాటక రాశికి అధిపతి.
బుధుడు – మిథున, కన్య రాశులకు అధిపతి.
కుజుడు – మేష, వృశ్చిక రాశులకు అధిపతి.
శుక్రుడు – వృషభ, తులా రాశులకు అధిపతి.
గురువు – ధనుస్సు, మీన రాశులకు అధిపతి.
శని – మకర, కుంభ రాశులకు అధిపతి.
రాహు, కేతువులు ఛాయాగ్రహాలు. అందువల్ల వీటికి ప్రత్యేక గృహాలు లేవు.