News May 21, 2024
కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు: కలెక్టర్

రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.
Similar News
News October 2, 2025
మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువతరం రాణించాలి: కలెక్టర్

మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేటి యువతరం అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్‌తో
కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిది కొనియాడారు.
News October 2, 2025
ఈ విషాదానికి 16 ఏళ్లు

2009 అక్టోబర్ 2న తుంగభద్ర, హంద్రీ నదుల ఉద్ధృతితో అతలాకుతలం చేసిన వరద కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లూ, ఆస్తులు, జ్ఞాపకాలు నీటిలో కొట్టుకుపోయాయి. అనేక కుటుంబాలు రోడ్లను ఆశ్రయించగా, వేలాది మంది తమ బంధువులను, జీవనాధారాలను కోల్పోయారు. నేటికి 16 ఏళ్లు గడిచినా ఆ భయం, బాధలు మిగిలే ఉన్నాయి. ఆ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ నగర ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
News October 2, 2025
ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: జేసీ

ఈనెల 15న రేషన్ షాప్ డీలర్ల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పొందవచ్చని జేసీ డా.బి.నవ్య వెల్లడించారు. 16వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారన్నారు. బుధవారం కర్నూలులోని బుధవార పేటలో ఎఫ్‌సీ షాపులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.