News May 21, 2024

‘పిరమిడ్స్’ రాళ్లు అలా తరలించారట!

image

టన్నుల బరువుండే అసంఖ్యాక రాళ్లను వందల అడుగుల ఎత్తులో పేర్చి పిరమిడ్లను నిర్మించారు పురాతన ఈజిప్షియన్లు. అంతటి బరువైన రాళ్లను ఎలా తరలించారన్న మిస్టరీ వీడింది. ఒకప్పుడు నైలు నదీ పాయ ఒకటి పిరమిడ్ల నిర్మాణ ప్రాంతానికి దగ్గరగా ప్రవహించేదట. ఉపగ్రహ చిత్రాలు, సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు ప్రకటించారు. ఆ పాయ ద్వారానే రాళ్లను అప్పటివారు తరలించారని, క్రమేపీ అది కనుమరుగైందని తెలిపారు.

Similar News

News December 25, 2024

IND vs AUS: నితీశ్ కుమార్ రెడ్డిపై వేటు?

image

ఆస్ట్రేలియాతో రేపు జరిగే నాలుగో టెస్టుకు నితీశ్ రెడ్డిని జట్టు నుంచి తప్పించాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో స్పిన్నర్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న నితీశ్‌ను తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారని గుర్తు చేస్తున్నారు.

News December 25, 2024

ఏపీకి రావాలని మోదీకి చంద్రబాబు ఆహ్వానం

image

ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్ర పరిస్థితులు, అభివృద్ధి గురించి మోదీతో చర్చించారు. అమరావతికి రూ.15 వేల కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు కోరారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని కోరగా మోదీ అంగీకరించారు. జనవరి 8న వైజాగ్ వస్తానని మోదీ చెప్పారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.

News December 25, 2024

2024లో 27% రాబడి ఇచ్చిన బంగారం

image

పెట్టుబడి పరంగా 2024లో బంగారం సిరులు కురిపించింది. ఏకంగా 27% రాబడి అందించింది. నిఫ్టీ 50, నిఫ్టీ 500 కన్నా ఇదెంతో ఎక్కువ. దేశాల యుద్ధాలు, ప్రభుత్వాలు కూలిపోవడం, జియో పొలిటికల్ అనిశ్చితి వల్ల గోల్డుకు గిరాకీ పెరిగింది. RBI సహా అనేక సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ కొనడం ధరల పెరుగుదలకు మరో కారణం. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 2025లోనూ ఇదే ఒరవడి కొనసాగొచ్చని అంచనా. నేడు 24K బంగారం గ్రాము ధర ₹7,751.30.