News May 21, 2024
SRH ఫస్ట్ బ్యాటింగ్

అహ్మదాబాద్‌లో జరుగుతున్న క్వాలిఫయర్1లో SRH టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (C), రింకు, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.
SRH: హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, భువనేశ్వర్, కమిన్స్(C), విజయ్‌కాంత్, నటరాజన్.
>> SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News April 18, 2026
హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.
News April 18, 2026
GOOD NEWS: చిన్నారి పునర్వికకు పునర్జన్మ

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు నిలిచాయి. <<19232308>>దాతల<<>> ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇవాళ అందించారు. ‘ఇచ్చిన <<19240414>>మాట<<>> నిలబెట్టుకున్నాం. చిట్టి తల్లి నూరేళ్లు వర్ధిల్లు’ అని పునర్వికతో ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News April 18, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమే: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమి అని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని CM రేవంత్ అన్నారు. ‘NDA నిజాయతీగా బిల్లు తీసుకురాలేదు. 3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసింది. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేస్తే మద్దతిస్తాం. మహిళా రిజర్వేషన్లలోనూ SC, ST, OBC కోటాలు ఉండాలి’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. BJPకి 400సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.


