News May 21, 2024
ఈ స్టార్లు పౌరసత్వం లేకనే ఓటేయలేకపోయారు!

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో బాలీవుడ్ స్టార్లు ఓటేశారు. అయితే, కొందరు స్టార్లు ఓటేయలేదనే విమర్శలొస్తున్నాయి. అందులో భారత పౌరసత్వం లేక ఓటేయని వారున్నారు. అలియా భట్ &కత్రినా కైఫ్‌కి బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఉండగా, ఇమ్రాన్‌ఖాన్ అమెరికా & ఇలియానా పోర్చుగీస్ పౌరులుగా ఉన్నారు. ఫెర్నాండేజ్ శ్రీలంక, నోరా ఫతేహీకి కెనడా పౌరసత్వం ఉంది. ఇటీవలే అక్షయ్ కుమార్ భారత పౌరసత్వం తిరిగి పొందడంతో ఆయన ఓటేశారు.
Similar News
News April 19, 2026
నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.
News April 19, 2026
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రేపటి నుంచి చర్చలు!

USతో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ అమలుపై భారత్ ఆ దేశంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరపనుంది. ట్రంప్ టారిఫ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారిగా భారత్ బృందం వాషింగ్టన్‌కు చర్చలకు వెళ్లనుంది. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ సహా 16 దేశాల వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించడంపైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా USకు 10% టారిఫ్ చెల్లిస్తోంది.
News April 19, 2026
పండ్లకు స్ట్రిప్ పేపర్ టెస్ట్.. ఎలా చేస్తారు?

‘కాల్షియం కార్బైడ్’ వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మామిడి, అరటి, బొప్పాయి షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రాలను <<19672510>>ఆదేశించింది.<<>> స్ట్రిప్ పేపర్ టెస్ట్ చేయాలని సూచించింది. ఇందుకోసం పొటాషియం పర్మాంగనేట్‌తో శుద్ధి చేసిన పేపర్ లేదా రియాక్టివ్ స్ట్రిప్స్‌ను వాడతారు. దీన్ని పండ్లపై పెట్టగానే రంగు మారితే కృత్రిమంగా పండించే కెమికల్స్ ఉపయోగించినట్లు. ఈ స్ట్రిప్స్ ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి.


