News May 22, 2024

TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు మన HYDలో..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ఇంటర్మీడియట్ పూర్తై ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈమేరకు మన HYDలో TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నట్లు NIR వెల్లడించింది. దేశంలోనే IITH-18, IIIT HYD-55, HCU-71, JNTUH-83 ర్యాంకు సాధించాయి. టాప్ కాలేజీలలో అత్యుత్తమ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు NIRF పేర్కొంది.

Similar News

News October 27, 2025

DRC వద్ద మూడంచెల భద్రత.. ఎలా అంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో DRC సెంటర్ వద్ద ఎన్నికల అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. మెయిన్‌గేటు వద్ద కొందరిని, రెండోగేటు వద్ద ఇంకొందరిని, స్టేడియం లోపల ఇంకొందరిని భద్రత కోసం వినియోగిస్తారు. ఇందుకోసం ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సాయుధ బలగాలు ఉంటాయి.

News October 27, 2025

భారం నీదేనయా.. కిషన్‌రెడ్డినే నమ్ముకున్న కాషాయదళం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ ప్రచారం జోరుగా సాగిస్తోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండటంతో అభ్యర్థి గెలుపు బాధ్యత కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డిపైనే పడింది. దీంతో జూబ్లీహిల్స్ సీటు కమలం ఖాతాలో వేయాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఇక్కడి ప్రచారం జోరుగా సాగుతోంది.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో త్వరలో ఏపీ నేతల ప్రచారం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీకి చెందిన వారి ఓట్లు అధిక శాతం ఉన్నాయి. ఆ ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ఏపీ నేతలను ప్రచారానికి వినియోగించనుంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలువురు ఏపీ నాయకులున్నాయి. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ప్రచారం చేయనున్నారు.