News May 22, 2024

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తాం: కమిన్స్

image

కేకేఆర్‌తో క్వాలిఫైయర్ మ్యాచులో ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తామని SRH కెప్టెన్ కమిన్స్ అన్నారు. క్వాలిఫయర్‌-2 మ్యాచ్ జరిగే చెన్నై వికెట్ తమకు సరిగ్గా సరిపోతుందని.. అక్కడ గెలుస్తామనే నమ్మకముందన్నారు. ‘కేకేఆర్ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించాలని నిర్ణయించి సన్వీర్‌కు ఛాన్సిచ్చాం. మా ప్లాన్ బెడిసికొట్టింది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 11, 2025

విద్యార్థులకు శుభవార్త: లోకేశ్

image

AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.

News January 11, 2025

భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్

image

☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

News January 11, 2025

యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే

image

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌కు మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. బీజీటీలో రాణించిన జైస్వాల్‌‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మండిపడుతున్నారు. గత ఐపీఎల్‌లో కూడా ఆయన రాణించారని, సెలక్ట్ చేయాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.