News May 22, 2024
VZM: నేటి నుంచి ఆ సేవలు బంద్..?

విజయనగరం జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు రూ.50 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతో నేటి నుంచి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 46 ఉన్నాయి. వీటిలో ఏడాదికి రెండు లక్షలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.
Similar News
News April 17, 2026
ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.