News May 22, 2024
NLG: మరోసారి ‘సన్న’గా తెరపైకి!

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
నల్గొండలో ర్యాగింగ్‌పై కలెక్టర్ ఆరా

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.
News November 7, 2025
NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.
News November 7, 2025
పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.


