News May 22, 2024
పిట్లంలో వ్యక్తి హత్య.. అతడి భార్యపై ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716343154748-normal-WIFI.webp)
ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్‌లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 12, 2025
NZB: సీఎం రూ.35 వేలు బాకీ: ఎమ్మెల్సీ కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363415879_50139228-normal-WIFI.webp)
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్‌లో తలపెట్టనున్న మహిళా శంఖారావం సభ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.
News February 12, 2025
NZB: మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారు: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339154645_50139228-normal-WIFI.webp)
తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News February 12, 2025
NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357285585_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.