News May 22, 2024

IPL ఆడటంపై ధోనీ కీలక వ్యాఖ్యలు

image

తనకిదే చివరి IPL అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర ప్రాక్టీస్, వీలైనంత ఫిట్‌గా ఉండాలి. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరు. నేను ఏడాదంతా క్రికెట్ ఆడట్లేదు. IPLకు వచ్చేసరికి ఫిట్‌గా ఉండాలి. యువ ప్లేయర్లతో తలపడాలి. ప్రొఫెషనల్ ఆట అంత తేలికేం కాదు. ఆడాలంటే ఫిట్‌గా ఉండక తప్పదు. ఆహార అలవాట్లను మార్చుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’ అని తెలిపారు.

Similar News

News April 18, 2026

కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

image

కోచ్ నావల్‌సింగ్‌ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>

News April 18, 2026

భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

image

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.