News May 22, 2024
ADB: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ తీవ్రత తగ్గడంలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కొండాపూర్(మంచిర్యాల) 43.4, ఆసిఫాబాద్ 43.2, చాప్రాల(ఆదిలాబాద్) 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 19, 2026
ADB: 7 పరీక్ష కేంద్రాలు.. 1484 మంది విద్యార్థులు

ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. పదవ తరగతి కోసం 4, ఇంటర్ కోసం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,484 మంది అభ్యాసకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.
News April 19, 2026
సప్లిమెంటరీ అభ్యర్థులకు స్పెషల్ కోచింగ్: ADB DIEO

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని DIEO జాదవ్ గణేశ్ కుమార్ ఆదేశించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు సమన్వయంతో విద్యార్థుల బలహీనతలను గుర్తించి, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
News April 19, 2026
ADB: రేపటి నుంచి OPEN టెన్త్, ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యాసకులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, కేవలం పెన్, ప్యాడ్ మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


