News May 22, 2024
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్ష సూచన

ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్‌లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Similar News
News September 13, 2025
‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.
News September 13, 2025
ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
News September 12, 2025
5 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: జేసీ

జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.