News May 22, 2024
చేపలు పట్టే వృత్తి వివాదంపై కమిటీ: హైకోర్టు
TG: చేపలు పట్టే వృత్తి వివాదంపై 3 నెలల్లోగా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బెస్త/గాండ్ల/గంగపుత్ర-ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లు సంఘాల మధ్య విభేదాలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేసింది. మత్స్యకారుల సహకార సంఘాలు బెస్త/భోయ్/గంగపుత్ర/గాండ్ల వారికి మాత్రమే చెందుతాయని.. ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లకు సభ్యత్వం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Similar News
News December 26, 2024
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
AP: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది. అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి(26) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
News December 26, 2024
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
2025-26కు గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. JAN 13న సా.5 వరకు https://exams.nta.ac.in/AISSEE/లో దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12 ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15 ఏళ్లు ఉండాలి. పరీక్ష విధానం, సిలబస్ కోసం <
News December 26, 2024
తెలంగాణలో ముసురు..
తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది.