News May 22, 2024

FLASH: ఓయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్

image

HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్‌ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 2, 2026

HYD: సమ్మర్‌లో కరెంట్ కష్టాలకు చెక్!

image

వేసవి కాలంలో ఉక్కపోతతో నగరంలో అధికంగా ఏసీలు, ఫ్యాన్లు వినియోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ కోతలూ ఉంటాయి. ఈ సారి కోతలకు చెక్ పెట్టాలని విద్యుత్‌శాఖ చూస్తోంది. మహానగర వ్యాప్తంగా 20 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వేసవి కాలానికి ముందే వీటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 2, 2026

HYD: భార్యాభర్తలు.. మీకు ఇలాగే జరుగుతోందా?

image

అనుమానం ఆలుమగల మధ్య చిచ్చుపెడుతోంది. భార్య ఫోన్ చూసినా, భర్త ఇంటికి లేట్‌ వస్తే ఇంట్లో గొడవ జరుగుతోందని ‘గ్రేటర్ సిటీస్ ఆఫ్ కపుల్స్’ తెలిపింది. పని ఒత్తిడి, SMలో ఒక్కవీడియో చూస్తే, ఆల్గారిథం అలాంటివే చూపిస్తే వాస్తవం అనుకుంటున్నారు. ఓల్డ్ మెమొరీస్, పాస్‌వర్డ్ దాచడం వంటి చిన్నవాటితో అనుమానాలకు తావిస్తున్నారని HYD, ముంబైలో చేసిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాదిలోనైనా అన్యోన్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.