News May 22, 2024
యాభై LIC పాలసీలు తీసుకోవచ్చా?

బాలీవుడ్ నటి, BJP ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తనకు 50 LIC పాలసీలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే సామాన్యులు ఇలా 50 లేదా అంతకన్నా ఎక్కువ పాలసీలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వాటిని మేనేజ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదని, క్లెయిం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎంత మొత్తానికి కవరేజ్ అవసరమో పరిశీలించి అందుకు తగ్గ ప్లాన్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 21, 2026
నన్ను చంపాలని చూస్తే ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్

తనను చంపేందుకు ఇరాన్ యత్నిస్తే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చా. నాపై హత్యాయత్నం జరిగి, అందులో ఇరాన్ హస్తం ఉందని తేలితే ఆ దేశాన్ని భూమిపై నుంచి తుడిచేయాలని చెప్పా’ అని అన్నారు. మరోవైపు దురాక్రమణకు చేయి చాపితే ఆ చేతిని నరికేస్తామని ట్రంప్‌కు తెలుసని, వాళ్ల ప్రపంచాన్ని తగలబెట్టేస్తామని ఇరాన్ భద్రతా దళాల ప్రతినిధి హెచ్చరించారు.
News January 21, 2026
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.7,480 పెరిగి రూ.1,61,100కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.6,850 ఎగబాకి రూ.1,48,474 పలుకుతోంది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు మళ్లినట్లు తెలుస్తోంది.
News January 21, 2026
నైనీ బొగ్గు టెండర్లపై కేంద్రం అత్యవసర సమీక్ష

TG: నైనీ బొగ్గు టెండర్ల వివాదంపై CM రేవంత్, Dy CM భట్టి, మంత్రి వెంకట్‌రెడ్డిలపై BRS ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో పాత్ర లేకపోతే విచారణ చేయించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి హరీశ్ సవాల్ విసిరారు. ఈ తరుణంలో మంత్రి ఆదేశాలతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ అధికారులు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. నైనీతోపాటు ఇతర బొగ్గు బ్లాక్‌లపైనా సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.


