News May 22, 2024
నా వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు: స్వాతి

దాడి తర్వాత తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ MP స్వాతి మాలివాల్ మండిపడ్డారు. వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు నిర్వహించేందుకు కొందరిని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేందుకు మరికొందరిని ఏర్పాటు చేశారని వెల్లడించారు. రిపోర్టర్లను బెదిరించి ఫేక్ స్టింగ్ ఆపరేషన్ చేయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
Similar News
News April 17, 2026
పొట్ట ఉన్నవాడే గొప్ప.. వింత ఆచారం గురించి తెలుసా?

ఇథియోపియా అడవుల్లోని బోడి తెగ ఆచారం వింతగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇక్కడ పొట్ట ఎక్కువగా ఉన్న పురుషులకే ఫుల్ డిమాండ్. ఏటా జరిగే ‘కయోల్’ ఉత్సవం కోసం యువకులు శ్రమించకుండా ఆవు పాలు, రక్తం తాగి పొట్టను పెంచుకుంటారు. ఎవరి పొట్ట పెద్దగా ఉంటే వారే అందగాళ్లు. యువతులు కూడా భారీ పొట్ట ఉన్నవారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(49/100)
News April 17, 2026
హార్ముజ్‌ను ఓపెన్ చేసినందుకు థాంక్స్: ట్రంప్

హార్ముజ్ ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశానికి థాంక్స్ చెప్పారు. జలసంధిని ‘స్ట్రెయిట్ ఆఫ్ ఇరాన్’ (ఇరాన్ జలసంధి)గా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇన్నాళ్లూ హార్ముజ్‌ను తెరవమని ట్రంప్ ఒత్తిడి చేసినా తలొగ్గని ఇరాన్ లెబనాన్-ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌తో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపైనా ఆశలు చిగురించాయి.
News April 17, 2026
BIG ALERT: రేపు మండే ఎండలు.. పిడుగులతో వర్షాలు

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, పిడుగులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు 27 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, ప.గోదావరి, ఏలూరు జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


