News May 22, 2024

మూడు బంగారు మెడల్స్ అందుకున్న నెల్లూరు విద్యార్థి

image

జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటిలో బుధవారం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరులోని వి.మాలకొండ రెడ్డి నగర్‌కు చెందిన చందన గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకుంది. చందన 2021-22 బ్యాచ్‌లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. చందన మాట్లాడుతూ.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా రాణించాలన్నది తన ఆశయమన్నారు.

Similar News

News January 22, 2025

కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం

image

పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.

News January 21, 2025

బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే

image

బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 

News January 21, 2025

నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు

image

నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.