News May 22, 2024
రక్తహీనతపై శ్రద్ధ వహించాలి: మన్యం కలెక్టర్

రక్తహీనతపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ గర్భిణీలలో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లిబిడ్డల నమోదు, కంటి వెలుగు, 108 వాహనాలు వంటి తదితర అంశాలపై సమీక్షించారు.
Similar News
News April 18, 2026
జీవప్రాణులకు జలమే ఆధారం: VZM కలెక్టర్

జీవప్రాణులకు జలమే ఆధారమని విజయనగరం కలెక్టర్ రాంసుందర రెడ్డి పేర్కొన్నారు. శనివారం అలకనంద కాలనీలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొనే విధంగా ప్రజా చైతన్యం రావాలన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.