News May 22, 2024
విద్యార్థి సంఘాలతో ఓయూ కొత్త వీసీ MEETING
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News November 28, 2024
సిద్దిపేట: 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూత..?: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి నెలకొందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు ఉన్న విద్యార్థుల పాఠశాలలు 4,314, మొత్తం 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసేసే ప్రణాళికతో ఉన్నట్లున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.
News November 28, 2024
మెదక్: కుతూరిని చంపిన తండ్రికి జీవిత ఖైదు
కూతుర్ని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మి శారద బుధవారం తీర్పునిచ్చారు. టేక్మాల్ మండలం పాల్వంచకు చెందిన రమణయ్య(27)ను సావిత్రి రెండో పెళ్లి చేసుకుంది. కాగా అప్పటికే పుట్టిన వర్షిని(3)పై కక్ష పెంచుకున్న రమణయ్య 2021లో గొంతు నులిమి చంపేశాడు. ఈ కేసుపై విచారించి న్యాయమూర్తి ఈమేరకు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
News November 28, 2024
MDK: జనవరి వరకు చలిపంజా.. జాగ్రత్తలు తప్పనిసరి !
ఉమ్మడి మెదక్ జిల్లాలో జనవరి వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు రావడతతోపాటు కండరాలు కుచించుకుపోయి రక్తనాళాలు గడ్డ కట్టుకుపోయి ఇతర జబ్బులు వచ్చే ఆస్కారముందన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేడి చేసిన నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.