News May 22, 2024
ఢిల్లీ హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
ఢిల్లీలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నార్త్ బ్లాక్‌లో ఉన్న హోంశాఖ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈమెయిల్ చేశారు. దీంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. కంట్రోల్ రూమ్ వద్దకు 2 ఫైర్ ఇంజిన్లను రప్పించారు. కొద్దిరోజులుగా బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల స్కూళ్లు, ఆసుపత్రులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Similar News
News January 12, 2025
గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్: సీఎం రేవంత్
TG: గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ విధానం ఉండాలని సూచించారు. ఇతర దేశాల్లో బెస్ట్ విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చూడాలన్నారు.
News January 12, 2025
కేజ్రీవాల్‌కు అమిత్ షా కౌంటర్
రమేశ్ బిధూరీని బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయిస్తారా? అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు?’ అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రమేశ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
News January 12, 2025
80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్
ఝార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.