News May 22, 2024
కడప: ‘విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి’

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని TNSF కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.
Similar News
News April 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,390
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,159
* 10 గ్రాముల వెండి ధర రూ.2,550.
News April 18, 2026
పులివెందుల టీడీపీలో వర్గపోరు?

పులివెందుల టీడీపీలో వర్గపోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అంటీఅంటనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కోవర్టు అని వ్యాఖ్యానించారు. ప్రధాన నేతల మధ్యే సఖ్యత లేకపోతే ఎలా అని కార్యకర్తలు భావిస్తున్నారు.
News April 18, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 273 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం పోలీస్ అధికారులు వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 273 మందిపై కేసులు నమోదు చేసి, రూ.78,040 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు సూచించారు.


