News May 22, 2024
ప్రకాశం: ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్ల నియామకం
ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం అబ్జర్వర్లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులను నియమించారు. బాపు గోపీనాథ్(సంతనూతలపాడు), మయూర్ కె మహత(వైపాలెం), గుంజం సోనీ(దర్శి), అరవింద కుమార్ (OGL), అనిమేష్(MRKP), ఆనంద్ కుమార్ (కొండపి), ఆల్టినోలిన్(గిద్దలూరు), బి.నరేంద్ర(కనిగిరి)లను నియమించారు.
Similar News
News November 30, 2024
బాలినేని తనయుడిపై సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనయుడు ప్రణీత్ రెడ్డిపై డాక్టర్ యాదాల అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘గత ఎన్నికల ముందు చినగంజాం MPP అంకమరెడ్డి నన్ను ప్రణీత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సంతనూతలపాడు టికెట్ కోసం ఫోన్‌పేలో రూ.10 లక్షలు, క్యాష్‌గా మరో 15 లక్షలు ఇచ్చా. టికెట్ రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరా. కులం పేరుతో నన్ను తిట్టారు’ అని అశోక్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 30, 2024
చీమకుర్తిలో కిడ్నాప్
ప్రకాశం జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మడగడ గ్రామానికి చెందిన దినేశ్(16)ని కిడ్నాప్ చేశారు. ఈక్రమంలో అతడిని చీమకుర్తి గాంధీనగర్‌లో ఉంటున్న అరవింద్ అనే వ్యక్తి ఇంటికి కిడ్నాపర్లు తీసుకు వచ్చారు. దినేశ్ వారి నుంచి తప్పించుకుని చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. CI సుబ్బారావు కిడ్నాపర్లను వెంబడించి ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు.
News November 28, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.