News May 22, 2024

కంటింజెన్సీ రిస్క్ బఫర్ అంటే?

image

అత్యవసర నిధుల తరహాలో కేంద్రం కోసం కంటింజెన్సీ రిస్క్ బఫర్ (CRB) పేరుతో ఆర్‌బీఐ ప్రత్యేక నిధిని కేటాయిస్తుంది. ప్రభుత్వ బాండ్ల విలువలు తగ్గడం, మానిటరీ పాలసీలో మార్పులతో సవాళ్లు ఎదురైన సందర్భాల్లో ఈ నిధులను RBI వినియోగిస్తుంది. ఏటా కొంత పర్సెంట్ చొప్పున నిధులు కేటాయించి మిగిలిన మొత్తాన్ని ఆర్థిక ఏడాది ముగిశాక కేంద్రానికి ఇస్తుంది. ఆర్‌బీఐకి వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ CRBకి కేటాయిస్తుంది.

Similar News

News December 30, 2025

మొక్కజొన్నలో అధిక దిగుబడి రావాలంటే?

image

మొక్కజొన్నను డ్రిప్(బిందు సేద్యం) పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడులకు ఆస్కారం ఉంటుంది. ఈ విధానం వల్ల 40-50% నీరు ఆదా అవుతుంది. అలాగే కలుపు ఉద్ధృతి తగ్గి దాని తొలగింపునకు అయ్యే ఖర్చు మిగులుతుంది. యూరియా, పొటాష్ వంటి నీటిలో కరిగే ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించడం వల్ల మొక్కలకు అవసరమైన మోతాదులో పోషకాలు అంది, మొక్క బలంగా పెరిగి, పెద్ద కంకులు వచ్చి పంట దిగుబడి 30-40% పెరుగుతుంది.

News December 30, 2025

CETs తేదీలు ఖరారు.. చెక్ చేసుకోండి

image

తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కోర్సుల అడ్మిషన్లకు గల EAPCET 2026 మే 4- 11 తేదీల మధ్య ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక MBA/MCA ప్రవేశాల కోసం ICETను మే 13, 14 తేదీల్లో B.Ed ఎంట్రన్స్ టెస్ట్ EDCETను మే 12న నిర్వహిస్తామని తెలిపింది. మిగతా పరీక్షల షెడ్యూల్, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు పై ఫొటోలో వివరంగా పొందండి.
Share It

News December 30, 2025

మోహన్‌లాల్ తల్లి కన్నుమూత

image

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మోహన్‌లాల్‌కు సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.