News May 22, 2024
కడప: రైలు కింద పడి యువకుడు సూసైడ్

వల్లూరు మండలం తొల్లగంగనపల్లి సమీపంలో రైలు కింద పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకి మల్లికార్జున (17) రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో రిమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితమే మల్లికార్జున తల్లిదండ్రులు మరణించారు.
Similar News
News April 20, 2026
కడప రిమ్స్ వద్ద హత్య.. 11 మంది అరెస్ట్?

కడప రిమ్స్ వద్ద ఇటీవల దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మారెమ్మ జాతరలో జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కడప డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
News April 20, 2026
చమత్కార కవిత్వ రచనలో దిట్ట ‘గాడేపల్లి’: భూతపురి

అవధానాల్లో, ఆశుకవితా ప్రదర్శనల్లో చమత్కార భరితంగా కవిత్వ రచన చేయడంలో దిట్ట గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ‘నెలనెలా సీమ సాహిత్యం’ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. ఆధునిక కాలంలో అవధానాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు.