News May 22, 2024
నేపాల్ స్పిన్నర్‌కు షాకిచ్చిన యూఎస్ ఎంబసీ

T20 WC వేళ నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానేకు వీసా ఇచ్చేందుకు యూఎస్ ఎంబసీ నిరాకరించింది. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో సందీప్‌కు క్లీన్ చిట్ రావడంతో జట్టులో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఎంబసీ నిర్ణయం ఆయనను షాక్‌కు గురిచేసింది. 2019లోనూ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ ఇలాగే చేసినట్లు సందీప్ ట్వీట్ చేశారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే వీసా నిరాకరణకు కారణాలను ఆయన వెల్లడించలేదు.
Similar News
News April 17, 2026
విజయవాడ నుంచి ‘డ్రగ్స్’ సరఫరా.. ముగ్గురి అరెస్ట్!

హైదరాబాద్‌లోని కొండాపూర్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా మురళి, వికాస్, భరత్ అనే వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News April 17, 2026
పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.
News April 17, 2026
దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.


