News May 22, 2024
స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అక్కడ భద్రతా సిబ్బంది పనితీరును, సీసీ కెమెరాలు విభాగాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అభ్యర్థుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
Similar News
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
News July 8, 2025
గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.
News July 8, 2025
GNT: ఆన్లైన్ ట్రేడింగ్ మాయలో భారీ నష్టం.. ఎస్పీకి ఫిర్యాదు

పొన్నూరు ఇటికంపాడు రోడ్డుకు చెందిన మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి గురయ్యారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ ప్రారంభించగా, కాల్స్ ద్వారా ఆకర్షితుడై రూ.27 లక్షలు మోసపోయారు. మొదట లాభాలంటూ ఆశ చూపి తర్వాత మొత్తం కట్టించారని, తర్వాత ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని సోమవారం ఆయన ఎస్సీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.