News May 22, 2024

అందుకే సన్న వడ్లకు రూ.500 బోనస్: మంత్రి సీతక్క

image

TG: సన్న వడ్ల ఉత్పత్తిని పెంచేందుకే రూ.500 బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి సీతక్క తెలిపారు. ‘తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనానికి వినియోగించేవారు. మేము రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది’ అని చెప్పారు.

Similar News

News April 17, 2026

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

image

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.

News April 17, 2026

‘దుష్టచతుష్టయం’ అంటే ఎవరు?

image

ఎవరైనా నలుగురు కలిసి తప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు వారిని ‘దుష్టచతుష్టయం’తో పోలుస్తాం. రాజకీయాల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. మహాభారతంలోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడిని కలిపి దుష్టచతుష్టయం అని మహా కవి తిక్కన ఉద్యోగ పర్వంలో సంబోధించారు. ‘మాయా బజార్’ సినిమా ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ జీవితంలో ఇలా దుష్టచతుష్టయం ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 17, 2026

బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

image

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.