News May 23, 2024

చర్చలు విఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కొనసాగింపు

image

AP: ప్రభుత్వంతో ప్రైవేట్ ఆస్పత్రుల చర్చలు మరోమారు విఫలమయ్యాయి. రూ.1500 కోట్ల బకాయిల్లో రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO రూ.203 కోట్లు విడుదల చేస్తామన్నారని పేర్కొన్నాయి. దీంతో స్కీమ్ సేవల బంద్ కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. అయితే ఆస్పత్రుల్లో పథకం సేవలు కొనసాగేలా చూడాలని కలెక్టర్లను CEO ఆదేశించారు. బకాయిలు త్వరలో విడుదల చేస్తామన్నారు.

Similar News

News January 2, 2026

విశాఖ ఏజెన్సీలో లాభాలు అందిస్తున్న స్ట్రాబెర్రీ సాగు

image

విశాఖ జిల్లా లంబసింగి పరిధిలో స్ట్రాబెర్రీ సాగు జోరందుకుంది. మంచి లాభాలు వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణె నుంచి మొక్కలు తెచ్చి నాటుతుండగా, ఏప్రిల్ చివరి వరకు దిగుబడి ఉంటుంది. ఎకరా సాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు కాయలు, స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, జూస్ రూపంలో విక్రయిస్తూ పెంపకందారులు మంచి ఆదాయం పొందుతున్నారు.

News January 2, 2026

పేరెంట్స్ వాట్సాప్‌కు ఇంటర్ స్టూడెంట్స్ హాల్‌టికెట్లు

image

TG: హాల్‌టికెట్లను విద్యార్థుల పేరెంట్స్‌ వాట్సాప్‌కు పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ జరగనుండగా 45 రోజుల ముందే వాట్సాప్‌కు లింక్ పంపుతామని, దీంతో వాటిలో తప్పులేమైనా ఉంటే గుర్తించే వీలుంటుందని పేర్కొంది. ఫస్టియర్ స్టూడెంట్స్ తమ SSC రోల్ నంబర్, DOB.. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News January 2, 2026

లొంగిపోయిన దేవా

image

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.