News May 23, 2024
మా ఓటమికి కారణం అదే..: డుప్లెసిస్

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని RCB కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉండేదన్నారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్ద ఉపయోగపడలేదని చెప్పారు. పాయింట్ల పట్టికలలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమేటర్ మ్యాచ్ వరకు రావడం గర్వంగా ఉందన్నారు. కాగా RCB విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని RR 19 ఓవర్లలోనే చేధించింది.
Similar News
News March 12, 2026
కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.
News March 12, 2026
ఫిరాయింపుల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో BRS పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే పిటిషన్లను పరిష్కరించారని న్యాయవాది సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు విచారణ ముగిసినట్లు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ప్రకటించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా స్పీకర్ ప్రసాద్ 10 మందికి MLAకు <<19352106>>క్లీన్‌చిట్<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.
News March 12, 2026
నిరుద్యోగులకు అలర్ట్.. ఏడాదికి 2 సార్లే..

TGPSC వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో మార్పులు చేసింది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే OTRలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25లోగా చేసుకోవాలని కమిషన్ సూచించింది.


