News May 23, 2024

BRS ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడీ మద్దతు

image

TG: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యావంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేశ్‌ను గెలిపించాలని ఎక్స్(ట్విటర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. పట్టభద్రులు రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Similar News

News November 15, 2025

గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందా?

image

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్‌ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News November 15, 2025

సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

image

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>

News November 15, 2025

బిహార్: ఓట్ షేరింగ్‌లో ఆర్జేడీనే టాప్

image

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.