News May 23, 2024
సంజూ, పరాగ్ అరుదైన ఘనతలు
రాజస్థాన్ రాయల్స్‌కు అత్యధిక విజయాలు(31) అందించిన కెప్టెన్‌గా షేన్ వార్న్ సరసన సంజూ శాంసన్ చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్(18), స్టీవెన్ స్మిత్(15) ఉన్నారు. అలాగే ఈ సీజన్‌లో అత్యధిక రన్స్(567) చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రియాన్ పరాగ్ ఘనత సాధించారు. ఓవరాల్‌గా యశస్వి జైస్వాల్ 625 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. అతను 2023లో ఈ ఫీట్ నమోదు చేశారు.
Similar News
News December 26, 2024
జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి
మొజాంబిక్ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.
News December 26, 2024
సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్
TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.
News December 26, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.