News May 23, 2024
VZM: పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

విజయనగరం గిరిజన యూనివర్సిటీలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాలకు తుది గడువును ఈ నెల 26వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వైస్ ఛాన్స్లర్ ప్రొ.తేజస్వి కట్టిమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష రాసిన వారు 26వ తేదీ రాత్రి 11.55 వరకు https://www.ctuap.ac.in లో గాని https://ctuapcuet.samarth.edu.in/pg లో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News November 6, 2025
రాజాం: పాము కాటుకు గురైన రైతులు

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 6, 2025
ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.
News November 5, 2025
జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.


