News May 23, 2024
నేడు కర్నూలులో APERC కార్యాలయం ప్రారంభం
రాష్ట్ర విభజన నుంచి HYDలోనే కొనసాగుతున్న APERC(ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ప్రధాన కార్యాలయం APకి తరలిరానుంది. కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో 2 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఇవాళ అధికారులు ప్రారంభోత్సవం చేయనున్నారు. వారంలో కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అమరావతిలో కాకుండా కర్నూలులో ఆఫీస్ నెలకొల్పడంపై హైకోర్టులో విచారణ సాగుతోంది.
Similar News
News January 10, 2025
భారత క్రికెటర్ నితీశ్ రెడ్డికి ACA సన్మానం
టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఘనంగా సన్మానించింది. బీజీటీ సిరీస్‌లో గొప్పగా ఆడినందుకు ఆయనను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. త్వరలో ఏసీఏ ఆయనకు ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందించనుంది. కాగా బీజీటీలో నితీశ్ 298 పరుగులతో టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతోనూ చెలరేగారు.
News January 10, 2025
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీలో జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌గా పేరు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
News January 10, 2025
26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
TG: అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం 2 కళ్లలా భావిస్తోందని CM రేవంత్ వెల్లడించారు. కలెక్టర్లు ఇంకా పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. IAS, IPS అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. JAN 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.