News May 23, 2024
రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం: తుమ్మల
TG: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్న వడ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు రూ.500బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకూ దీన్ని వర్తింపజేస్తామని వివరించారు.
Similar News
News January 10, 2025
టెస్టు జెర్సీతో జడేజా పోస్టు.. రిటైర్మెంట్‌పై చర్చలు
IND ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాలో తన ఎనిమిదో నంబర్ టెస్టు జెర్సీ ఫొటోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన అతను టెస్టులకూ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అతను టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. కాగా జడేజా 80 టెస్టుల్లో 3,370 రన్స్ చేసి, 323 వికెట్లు పడగొట్టారు.
News January 10, 2025
శీతాకాలంలో బాదం ప్రయోజనాలెన్నో
శీతాకాలంలో తరచూ అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. వాటి నుంచి రక్షణ కలిగేలా రోగనిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు బాదం గింజలు ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘బాదంలో విటమిన్-ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, రిబోఫ్లావిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. బరువు నియంత్రణకు, శరీరం వెచ్చగా ఉండేందుకు ఇవి మేలు చేస్తాయి. బాదం గింజల్ని రోజూ తినడం మంచిది’ అని పేర్కొంటున్నారు.
News January 10, 2025
భారత క్రికెటర్ నితీశ్ రెడ్డికి ACA సన్మానం
టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఘనంగా సన్మానించింది. బీజీటీ సిరీస్‌లో గొప్పగా ఆడినందుకు ఆయనను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. త్వరలో ఏసీఏ ఆయనకు ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందించనుంది. కాగా బీజీటీలో నితీశ్ 298 పరుగులతో టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతోనూ చెలరేగారు.