News May 23, 2024

కరీంనగర్: సన్నాల వైపు రైతుల చూపు!

image

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌‌ను వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్న రకం వరి సాగు పెరగనుంది. సాధారణ వరి సాగు విస్తీర్ణం కన్నా అదనంగా 15 నుంచి 20 శాతం పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ నీరు, సానుకూల వాతావరణం దృష్ట్యా ఖరీఫ్‌లో రైతులు సన్న రకం వరి సాగు వైపు మక్కువ చూపుతారు.

Similar News

News October 2, 2024

కేటీఆర్‌పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై జరిగిన దాడిని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ ఇదేనా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

News October 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి మండలంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో పర్యటించిన దేవాదాయ, జౌలి చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.
@ వేములవాడ ఏరియా ఆసుపత్రికి మూడవసారి కాయకల్ప అవార్డు.

News October 1, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.82,779 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,632, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,000, అన్నదానం రూ.17,147 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.