News May 23, 2024
NLG: నేడు ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష

ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం సూర్యాపేటలో 1, కోదాడలో 2, నల్గొండలో 1 మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్ సెట్ ఛైర్మన్ ఆచార్య గోపాల్రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.
News November 13, 2025
NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.
News November 13, 2025
NLG: ఇప్పుడే ఇలా.. చలితో కష్టమే..!

నల్గొండ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు పగలు, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పడిపోతున్నాయి. మరోవైపు రోగులతో దవాఖానాలతో కిటకిటలాడుతున్నాయి.


