News May 23, 2024
లోక్‌సభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ?
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2014(8,251 మంది), 2019(8,054 మంది) ఎన్నికల కంటే ఈ సంఖ్య ఎక్కువ. ఇందులో మహిళల వాటా 10శాతం లోపే ఉంది. చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంత తక్కువ మొత్తంలో మహిళలు పోటీకి దిగడం గమనార్హం. ఇక జూన్ 4న వీరందరి భవితవ్యం వెల్లడి కానుంది. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 11, 2025
TODAY HEADLINES
* మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
* అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
* అమ్మాయిల జోలికి వస్తే తొక్కి నార తీస్తా: పవన్
* కేటీఆర్‌పై మరో కేసు నమోదు
* సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు
* రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్
* తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
News January 11, 2025
BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం
TG: MBNR జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. కాగా ఇవాళ ఉదయం సూర్యాపేట-ఖమ్మం హైవేపై జరిగిన <<15112586>>ఘటనలో<<>> నలుగురు మరణించారు.
News January 11, 2025
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
AP: గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500-3500 మందికి ఏడుగురు, 3501 నుంచి ఆపై జనాభాకు 8 మంది ఉండేలా సచివాలయ ఉద్యోగులను విభజిస్తారు. దీని ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.