News May 23, 2024
ట్రాయ్ పేరుతో ఫేక్ కాల్స్.. జాగ్రత్త!: అడిషనల్ డీజీ
TG: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఫోన్స్, సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయంటూ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని, గుర్తుతెలియని నంబర్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 10, 2025
కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ సతీమణి
UPలో జరగనున్న మహా కుంభమేళాకు యాపిల్ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ జాబ్స్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వామి కైలాషానంద మహారాజ్ వెల్లడించారు. ‘ఆమె మాకు కూతురులాంటిది. కమల అనే పేరు పెట్టాం. లారెన్ ఇక్కడకు రావడం రెండోసారి. వ్యక్తిగత ప్రోగ్రాం కోసం దేశానికి వస్తున్న ఆమె కుంభమేళాలో ధ్యానం చేస్తారు. తన గురువును కలుస్తారు. ఆమెను ఊరేగింపులోనూ చేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.
News January 10, 2025
కరెంటు ఛార్జీలపై శుభవార్త
AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.
News January 10, 2025
జాగ్రత్త బాసూ.. సంక్రాంతికి ఊరెళ్తున్నావా?
సంక్రాంతికి ఊరెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగదు, నగలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. ఇంటికి తాళం వేసినట్లు కనిపించకుండా కర్టెన్ తొడగాలి. CC కెమెరాలు బిగించుకోవాలి. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు. ఇంటి ముందు తెలిసినవారితో చెత్త శుభ్రం చేయించుకోవాలి. కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలి.