News May 23, 2024

HYD: టీ-వర్క్స్, టీ-హబ్‌కు సీఈవోల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ-హబ్ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా టీ- వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం.

Similar News

News September 19, 2025

HYD: హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌రావు

image

BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు తనపై నమోదైన 3 వేర్వేరు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ HYDలోని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఆలయ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

News September 19, 2025

HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

image

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్‌ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News September 19, 2025

HYDలో భారీ వరద.. కారు గ్లాస్‌లో నుంచి బయటకు తీశారు

image

గౌలిపురాలో నిన్న రాత్రి భారీ వర్షం కురువడంతో హనుమాన్‌నగర్‌ ఫేజ్‌- 2లో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకుంది. మణికొండకు చెందిన ఓ కుటుంబం కారులో వచ్చి దిగేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ఉద్ధృతికి కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కారులోఉన్న రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలను డోర్ గ్లాస్ లోంచి వారిని బయటికి తీశారు.